రామప్ప ఆలయ అభివృద్ధికి ఈఓ కృషి | - | Sakshi
Sakshi News home page

రామప్ప ఆలయ అభివృద్ధికి ఈఓ కృషి

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

వెంకటాపురం(ఎం): రామప్ప ఆలయ అభివృద్ధికి ఈఓ ఇమ్మడి భాస్కర్‌ నిరంతరం చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌న్‌ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ కొనియాడారు. పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఆయన ఆదివారం దర్శించుకున్న అనంతరం ఈవో భాస్కర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయంలో మూసుకుపోయిన సోమసూత్ర ద్వారం సమస్యను భారత పురావస్తు శాఖతో సమన్వయం చేసుకుంటూ ఐదు నెలల్లో పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. దాతల సహకారంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న పనులు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో ఈఓ భాస్కర్‌ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీనివాస్‌, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొమురవెల్లి రమేశ్‌, రెడ్‌క్రాస్‌ కోశాధికారి శిరుప సతీష్‌, రైస్‌ మిల్లర్స్‌ సంఘం కోశాధికారి ఎలగందుల మోహనన్‌, ఉపాధ్యక్షుడు అక్కల రఘు, కొండ్లె కృష్ణమూర్తి, అక్కినపల్లి ప్రభాకర్‌, ఇమ్మడి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement