రామప్ప ఆలయానికి నాడు కోస్టల్ ప్రాజెక్టుతో, నేడు ఓపెన్‌కాస్టుతో ప్రమాదం నెలకొంది. 2011లో దేవాదుల ప్రాజెక్టు కింద సొరంగపనుల కోసం కోస్టల్ ప్రాజెక్ట్ రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లతో తవ్వకాలు చేపట్టగా కవులు, కళాకారులతో ఉద్యమాలు చేపట్టి అడ్డుకున్నాం. ఇసుక పునాదులతో నిర్మించిన రామప్ప ఆలయానికి ఓపెన్‌కాస్ట్ గని కోసం చేపట్టే భారీ పేలుళ్లతో ప్రమాదం పొంచి ఉంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రామప్ప ఆలయాన్ని, రామప్ప చెరువును ప్రస్తుతం ఎవరూ నిర్మించలేరు. నాణ్యత లేని బొగ్గు కోసం సింగరేణి సంస్థ చేపట్టే ఓపెన్‌కాస్టు గనిని రామప్ప పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టి అడ్డుకుంటాం. – ఆకిరెడ్డి రాంమోహన్‌రావు,
రామప్ప పరిరక్షణ సమితి అధ్యక్షుడు


