సమాచార హక్కు చట్టంతో పారదర్శకత | - | Sakshi
Sakshi News home page

సమాచార హక్కు చట్టంతో పారదర్శకత

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

● అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు

ములుగు: సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్లు సీహెచ్‌ మహేందర్‌జీ, సంపత్‌ రావులు అన్నారు. సమాచార హక్కు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం–2005 జిల్లా స్థాయి వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్‌ ఆధ్వర్యంలో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సరాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ, పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తామని, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు. అక్టోబర్‌ 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అవగాహన పత్రాలు, నోటీసులను స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ రాజ్‌కుమార్‌, జిల్లా అధికారులు, పీఐఓలు, అసిస్టెంట్‌ పీఐఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement