‘కపాస్‌ కిసాన్‌’పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘కపాస్‌ కిసాన్‌’పై అవగాహన కల్పించాలి

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

● అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

ములుగు: పత్తి కొనుగోలు సీజన్‌ 2026–27లో కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా పత్తి విక్రయించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ సీహెచ్‌.మహేందర్‌జీ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన పలు శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి కొనుగోలు సీజన్‌కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, రైతులకు అవగాహన కల్పించడం, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాల కల్పనపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా పత్తి విక్రయ ప్రక్రియను సంబంధించిన వివరాలను తెలుసుకునేలా అవసరమైనా నమోదు, పంట వివరాలను ధ్రువీకరణ ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్ధేశించిన నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతం ఆధారంగా ధరలో మార్పులు ఉంటాయన్నారు. తేమ శాతం పెరిగే కొద్ది నిబంధనల ప్రకారం ధరలో కోత విధిస్తూ గరిష్టంగా 12 శాతం తేమ వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు పత్తిని సాధ్యమైనంత వరకు ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement