ములుగు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ టీఎస్ తరఫున నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బిక్షం గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాయల్ ప్లాజాలో నిర్వహించిన పీఆర్‌టీయూ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్‌సీ, ఈహెచ్‌ఎస్, సీపీఎస్, పెండింగ్ డీఏలు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సంఘం కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం మరింత ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు వేమ్ యాకూబ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కోకిల శ్రీరంగం ఎన్నియ్యారు. నూతన కార్యవర్గ ఆద్వర్యంలో జిల్లాలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి భిక్షంగౌడ్


