ములుగు రూరల్: రైతులు విత్తనోత్సత్తికి ముందుకు రావాలని వ్యవసాయ శాస్త్రవేత్త గొనియానాయక్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ కాన్పరెన్స్హాల్లో రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన వరి విత్తనాలను పండించడంలో మెలకువలు నేర్చుకోవాలన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా వరి విత్తనాలను మార్కెటింగ్ చేసుకోవచ్చని వివరించారు. అందుకు ముందుకొస్తే ఆర్థికసాయం నాబార్డ్‌ను నుంచి అందిస్తామన్నారు. ప్రైవేట్ విత్తన సంస్థల ఆదిపత్యాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, టీఆర్వీకే కోఆర్డినేటర్ విశ్వతేజ, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్‌కుమార్, ఉద్యానశాఖ జిల్లా అధికారి సంజీవరావు, జిల్లా సహకార అధికారి రాంమోహన్, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ప్రజ్ఞ, పీఏసీఎస్ సెక్రటరీలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.


