వెంకటేశ్వర్‌రావు ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

వెంకటేశ్వర్‌రావు ఆశయ సాధనకు కృషి

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

వెంకటేశ్వర్‌రావు ఆశయ సాధనకు కృషి

వెంకటాపురం(కె): సీపీఎం పార్టీ దివంగత నాయకుడు వెంకటేశ్వర్‌రావు ఆశయ సాధనకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు రవి కుమార్‌ అన్నారు. గుర్రం వెంకటేశ్వరావు 16వ వర్ధంతిని గురువారం సీపీఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన వర్ధంతి సభలో రవికుమార్‌ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహాచారి, తోట నాగేశ్వరావు, గుర్రం పుల్లారావు, చిట్టెం ఆదినారాయణ, దేవమణి, కొప్పుల రఘుపతి, పర్శిక రాంబాబు, గ్యానం వాసు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement