మంగపేట: కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తు గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నికల ఓటరు జాబితా సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యహరిస్తున్న తీరుపై శాంతియుత నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, చాద మల్లయ్య, శ్రావణ్‌కుమార్, నరేష్, బాలన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.


