మంగపేట: వన్యప్రాణుల ఆవశ్యకతను
వివరిస్తున్న లాయక్ హుస్సేన్
ఏటూరునాగారం: ర్యాలీ నిర్వహిస్తున్న
అధికారులు
ఏటూరునాగారం: అటవీశాఖ ఆధ్వర్యంలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు, ప్రజాప్రతినిధులు యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో దక్షిణ విభాగం చేపట్టిన సంరక్షణ చర్యలను ప్రొజెక్టర్ ద్వారా ఎఫ్‌ఆర్‌ఓ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణ అందించాంటే అటవీ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. జిల్లాలో 87 శాతం అడవులు ఉండడంతో ములుగు అడవుల జిల్లాగా పిలవడం జరుగుతుందన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు అడవుల సహజ సంపద పర్యాటక ప్రాంతాలు గిరిజన కుంభమేళాలుగా పిలవబడే అడవులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అడవులను పర్యాటకులు సందర్శిస్తున్నట్లు తెలిపారు. 2050 హెక్టార్ల మేర నష్టపోయిన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అటవీశాఖ ప్రయత్నం చేస్తుందన్నారు. సుమారు 650 హెక్టార్లలో అటవీశాఖ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, గతంలో ఉన్న అటవీ సహజ రుపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు విషయాన్ని గమనించి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వన్యప్రాణులు ప్రాంతాల్లో వేయవద్దని అధికారులు కోరారు. ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈమేరకు అధికారులు అటవీశాఖ కార్యాలయం నుంచి ఏటూరునాగారం వరకు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప అటవీశాఖ అధికారి నారాయణ, సెక్షన్ అధికారులు బాలాజీ, శోభరాణి, బీట్ అధికారులు దయానంద్, వేణు, వినోద్, పవన్, రాజేష్, రవి, శ్రీనాథ్, అనూష, జ్యోష్ణ, జూనియర్ అసిస్టెంట్ పూర్ణ చందర్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
మంగపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అటవీ శాఖ మంగపేట ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి లాయక్ హుస్సేన్ ఆధ్వర్యంలో జాతీయ వన్య ప్రాణుల దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. అక్టోబర్ 02 నుంచి 08 వరకు నిర్వహించే వారోత్సవాల ముగింపు సందర్భంగా కళాశాల విద్యార్థులకు వణ్యప్రాణుల అవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్, బీటు అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్


