కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

ములుగు రూరల్‌: డిగ్రీ కళాశాలలో బతుకమ్మలతో అధ్యాపకులు

ఏటూరునాగారంలో..

ములుగు రూరల్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గురువారం మహిళా అధ్యాపకులు పూలతో బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లేశం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అతి పెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు. ప్రకృతి, సాంప్రదాయాలను గౌరవిస్తు జరుపుకునే పూల పండుగ బతుకమ్మ అని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ బాలయ్య ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు అనిల్‌కుమార్‌, ఉదయశ్రీ, కవిత, సరిత, శిరీష, రాధిక, విజేత, తేజోలత, తదితరులు పాల్గొన్నారు.

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రేణుక మాట్లాడు.. తూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబ మనీ, బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు నవీన్‌, వెంకటయ్య, జ్యోతి, కనీఫ్‌ ఫాతిమా, సంపత్‌, జీవవేణి, రమేష్‌, శ్రీధర్‌, రాజశేఖర్‌, భావన భారతి, భాస్కర్‌, శ్రీకాంత్‌, ప్రశాంతి, సిబ్బంది శ్రీను, సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement