వెంకటాపురం (ఎం): పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ములుగు ప్రాజెక్టు సీడీపీఓ శిరీష సూచించారు. గురువారం మండలంలోని నర్సాపూర్ సెక్టార్ పరిధిలోని నారాయణగిరిపల్లెలో పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి పోషక విలువలున్న సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతీ కుటుంబం పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో పోషకాహారం, ఆరోగ్యం, జంక్‌ఫుడ్ దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ అన్నం శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జితేందర్‌రెడ్డి, సూపర్‌వైజర్ కళావతి, పోషణ అభియాన్ డీసీ మమత, అంగన్‌వాడీ టీచర్లు పూలమ్మ, సంధ్య, హెల్పర్లు పాల్గొన్నారు.


