నాయీబ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

నాయీబ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించాలి

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

నాయీబ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించాలి

వెంకటాపురం(ఎం): నాయీబ్రాహ్మణుల సేవలను ప్రభుత్వాలు గుర్తించి, అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని నాయీ బ్రాహ్మణుల సంఘం మండల అధ్యక్షుడు నడిగోటి ప్రభాకర్‌ కోరారు. గురువారం మండల కేంద్రంలో మండల ప్రధాన కార్యదర్శి మొగిలిచర్ల అనిల్‌ అధ్యక్షతన గురువారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. మేడారం జాతరలో నాయీ బ్రాహ్మణులు అందించే సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. తలనీలాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నప్పటికీ, నాయీ బ్రాహ్మణులకు కనీస సౌకర్యాలు, ఉచిత గుర్తింపు కార్డులు కల్పించడం లేదని అన్నారు. జిల్లాలో 18 ఏళ్లు పైబడిన నాయీ బ్రాహ్మణులందరికీ మేడారం జాతరలో ఉచిత గుర్తింపు కార్డులు మంజూరు చేసి, అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం నాయీ బ్రాహ్మణులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గౌరవ అధ్యక్షుడు వేల్పుగొండ మధు, ముఖ్య సలహాదారుడు ఎం.రాజు, ఎం.మొగిలి, ఉపాధ్యక్షులు అన్నం రాజ్‌కుమార్‌, మొగిలిచర్ల శరత్‌, కోశాధికారి మాచర్ల కోటి, ప్రచార కార్యదర్శి నడిగోటి శ్రీనివాస్‌, కార్యదర్శి సతీష్‌, కార్యవర్గ సభ్యులు సతీష్‌, సంపత్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement