కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల అంతర్‌కళాశాలల వాలీబాల్ పోటీల్లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టువిజేతగా నిలిచిందని ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జె.సోమన్న బుధవారం తెలిపారు. వరంగల్ కిట్స్‌లో ఇటీవల నిర్వహించిన వాలీబాల్ అంతర్‌కళాశాలల పోటీల్లో విజేత జట్టుకు కిట్స్ కళాశాల రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు. ఈ అసోసియేషన్ కోఽశాధికారి డాక్టర్ కిరణ్‌కుమార్‌గౌడ్, సంయుక్తకార్యదర్శి మధుకిషన్, బాధ్యులు శశికాంత్, అనిత, వెంకన్న, వెంకటస్వామి, ప్రొఫెసర్ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.


