ఈవీఎం గోదాం భద్రతపై నిఘా | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాం భద్రతపై నిఘా

Oct 8 2026 1:18 AM | Updated on Oct 8 2026 1:18 AM

● కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ములుగు: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల) గోదాం భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్‌ సహదేవరావు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారీ కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోదాం ప్రధాన ద్వారానికి ఏర్పాటు చేసిన సీల్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, నిరంతర నిఘా వ్యవస్థ, విద్యుత్‌ సరఫరా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పరికరాలను పరిశీలించారు. అగ్నిప్రమాదాలు, ఇతర భద్రతాపరమైన సమస్యలు ఎదురైన సందర్భంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సంబంధిత సిబ్బందికి కలెక్టర్‌ సూచనలు చేశారు. అనంతరం ఈవీఎం గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలు తదితర రికార్డులను పరిశీలించారు. గోదాంను సందర్శించే ప్రతి వ్యక్తి వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. భద్రతా సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్‌ సెల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ నితీష్‌ కుమార్‌, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది, సంబంధిత అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement