ములుగు రూరల్: ప్రజాసేవే లక్ష్యంగా దేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలన కొనసాగిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్‌లు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సేవా జ్యోతియాత్రను వారు ప్రారంభించారు. ఈ యాత్రలో కాగడాలు చేపట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ సీఎంగా, ప్రధానమంత్రిగా అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేపట్టాలని సేవా జ్యోతి యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ వర్చువల్‌గా మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా దేశ ఆర్థిక శక్తిని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 2047 వరకు దేశం వికసిత్ భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారన్తుస్తానని వివరించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్ నగరపు రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహర్లాల్, కృష్ణవేణి, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీలు మోహన్‌రావు,
సీతారాంనాయక్


