ములుగు రూరల్: విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చండీశ్వరి దేవి అన్నారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని జాకారం మినీ గురుకులంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థినులు మంచి, చెడు స్పర్శపై మాట్లాడే బొమ్మతో అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. బాలకార్మిక నిషేధిత చట్టం, ఉచిత విద్యాహక్కు చట్టపై వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ స్వామిదాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
చండీశ్వరిదేవి


