నకిలీ సందేశాలకు స్పందించొద్దు | - | Sakshi
Sakshi News home page

నకిలీ సందేశాలకు స్పందించొద్దు

Oct 7 2026 1:34 AM | Updated on Oct 7 2026 1:34 AM

ములుగు: తన పేరు, ఫొటోను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు పంపుతున్న నకిలీ వాట్సాప్‌ సందేశాలకు ఎవరూ స్పందించవద్దని, ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన పేరు, ఫొటోను వాట్సాప్‌ డీపీలో పెట్టుకుని +66 98 476 2993 నంబర్‌ నుంచి అధికారులకు సందేశాలు పంపుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నంబర్‌ నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని, వెంటనే సంబంధిత నంబర్‌ను బ్లాక్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. తన పేరు, ఫొటో కనిపించినంత మాత్రాన అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలను విశ్వసించవద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అలాంటి సందేశాల ద్వారా డబ్బులు, బహుమతి కార్డులు అడిగినా స్పందించవద్దని తెలిపారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, రహస్య సంకేత సంఖ్యలను ఎవరికీ ఇవ్వవద్దని కోరారు. సైబర్‌ నేరగాళ్లు ప్రముఖుల పేర్లు, ఫొటోలను ఉపయోగించి ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు.

కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement