అర్హులు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

Oct 7 2026 1:34 AM | Updated on Oct 7 2026 1:34 AM

ములుగు రూరల్‌: జిల్లాలోని పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు ఒప్పంద పద్ధతిలో కొనసాగిస్తామని వెల్లడించారు. పల్లె దవాఖాన, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, పాలియేటివ్‌ కేర్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌, బ్లడ్‌ బ్యాంక్‌, మొబైల్‌ టీం డయాగ్నోస్టిక్‌ విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఓబీజీ స్పెషలిస్టులు 1, అనస్థీషియా 4, స్టాఫ్‌నర్సు 8, రెండో ఏఎన్‌ఎం 2, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 1 ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులు నేటి నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తులను ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమీకృత కలెక్టరేట్‌ భవనంలో ఎస్‌ 30లో అందించాలని సూచించారు. గత నెల 22న దరఖాస్తులు చేసిన స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని వివరించారు.

పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన

వెంకటాపురం(కె): మండల పరిధిలో ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను మంగళవారం డీపీఓ వెంకయ్య పరిశీలించారు. ఈ మేరకు రాచపల్లి, వీఆర్‌కే పురం, బెస్తగూడెం పంచాయతీలను సందర్శించి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్‌, సంతోశ్‌ తదితరులు ఉన్నారు.

మరింత బాధ్యతగా పనిచేయాలి

ములుగు రూరల్‌: హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన దయాసాగర్‌ మరింత బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో దయాసాగర్‌కు స్టార్స్‌ను ఎస్పీ అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ములుగు పీఎస్‌లో పనిచేస్తున్న దయాసాగర్‌ 1990లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించి వివిధ విభాగాలలో విధులు నిర్వహించారని వెల్లడించారు. పోలీస్‌శాఖలో క్రమశిక్షణ, అంకితభావంతో పని చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌, ఎస్సై చంద్రశేఖర్‌, జిల్లా పోలీస్‌ సంఘం అధ్యక్షుడు క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై

అవగాహన తప్పనిసరి

ములుగు రూరల్‌: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఐసీటీసీ కౌన్సిలర్‌ కుమార్‌సింగ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఎయిడ్స్‌ నిర్ధారణ క్యూఆర్‌కోడ్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అందులో వచ్చిన ప్రశ్నలకు సమాధానం అందిస్తే ఎయిడ్స్‌పై మీ పరిస్థితిని తెలియజేస్తుందని వివరించారు. సందేహాలకు 1097కు కాల్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఔట్‌రీచ్‌ వర్కర్‌ కిషన్‌, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలన

హన్మకొండ కల్చరల్‌ : భద్రకాళి ఆలయంలో ఈ నెల 11నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ముందస్తు భద్రతా ఏర్పాట్లను మంగళవారం వరంగల్‌ సీపీ శ్వేత పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతల కోసం పోలీస్‌శాఖ చేపడుతున్న చర్యలను సీపీ అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌ రావు, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement