అడవుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

Oct 7 2026 1:34 AM | Updated on Oct 7 2026 1:34 AM

ఏటూరునాగారం: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని దక్షిణ అటవీశాఖ రేంజ్‌ అధికారి అబ్దుల్‌ రహమాన్‌ అన్నారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అడవులు, వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే అనర్ధాలు, వన్యప్రాణుల సంరక్షణ వల్ల కలిగే లాభాలు, అడవులు అంతరించిపోతే జరిగే నష్టాన్ని విద్యార్థులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. అడవులను సంరక్షిస్తేనే మానవాళి మనుగడ బాగుంటుందని వివరించారు. విద్యార్థులు వా రి వారి గ్రామాల్లో తల్లిదండ్రులు, ప్రజలకు ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. వాతావరణాన్ని కాలుష్యం చేయడం వల్ల తుపాన్లు, భూకంపాలు, ఎల్‌నినో లాంటివి వస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ రేణుక, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌. వెంకటయ్య, అధ్యాపకులు నవీన్‌, జ్యోతి, కనీఫ్‌ ఫాతిమా, సంపత్‌, జీవవేణి, రమేశ్‌, శ్రీధర్‌, రాజశేఖర్‌, భావన, భారతి, భాస్కర్‌, శ్రీకాంత్‌, ప్రశాంతి, సిబ్బంది పాల్గొన్నారు.

అటవీశాఖ రేంజ్‌ అధికారి

అబ్దుల్‌ రహమాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement