ములుగు రూరల్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి గుండబోయిన చంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియలో చేయాల్సిన ఓటర్ లీస్టు సవరణ పూర్తిగా ఏకపక్షంగా ఈసీఐ నెట్ ద్వారా చేపట్టారని వెల్లడించారు. ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలను పక్కన పెట్టి దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓటర్లను అక్రమంగా తొలగించారని పేర్కొన్నారు. ఫారం 6 ఏకి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేశారన్నారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మకై ్క ఓటర్లను ప్రణాళిక ప్రకారం తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, రత్నం రాజేందర్, చిట్టిబాబు, మల్లారెడ్డి, ప్రవీణ్, కోటయ్య, రామస్వామి, నరేశ్, దేవేందర్, కవిత, రాజు, రవీందర్, శ్రీను, వెంకన్న, పోశాలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ధర్నా


