● టీజీఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ భిక్షపతి
వెంకటాపురం(ఎం): వ్యవసాయ పంటల సాగుకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయడమే లక్ష్యమని టీజీఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ భిక్షపతి తెలిపారు. వెంకటాపురం(ఎం) సెక్షన్ పరిధిలోని నర్సాపూర్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం పరిశీలించిన ఆయన విద్యుత్ సరఫరా పరిస్థితి, లోడ్లు, పరికరాల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ ఫీడర్లు, ట్రాన్‌న్స్ ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు, లో–వోల్టేజ్ సమస్యలు తలెత్తితే క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. విఫలమైన ట్రానన్స్‌ఫార్మర్లను ఆలస్యం చేయకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. రైతులు, వినియోగదా రులకు మెరుగైన సేవలు అందించేందుకు అధి కారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. విద్యుత్ మౌలిక వసతుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని భిక్షపతి సూచించారు.


