న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ములుగు రూరల్: ప్రస్తుత సమాజంలో మానవుని జీవితంలో వచ్చే మార్పులు, తీసుకునే ఆహారంతో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం కారణంగా ఎక్కువ మంది క్యాన్సర్ భారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవగాహన లోపం కారణంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జిల్లాలో చేపట్టిన నాన్–కమ్యూనికబుల్ డిసిజేస్(ఎన్‌సీడీ) విభాగం ఇటీవల చేపట్టిన సర్వే వివరాలు వెల్లడించింది.
మహిళలే అధికం
జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఎన్‌సీడీ సర్వే ఆధారంగా 238 మంది క్యాన్సర్ బాధితులను గుర్తించారు. వీరిలో అత్యధికంగా మహిళలు గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పాటు పురుషులు నోరు, గొంతు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం, దూమపానం, మద్యపానం కారణంగా పురుషులు అత్యధికంగా క్యాన్సర్ భారిన పడుతున్నారు.
వ్యాప్తికి కారణాలు ఇవే..
క్యాన్సర్ భారిన పడటానికి ప్రధాన కారణాలుగా వీటిని తీసుకోవచ్చు. ప్రజల్లో శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోవడంతో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, హెచ్‌పీవీ సంక్రమణ, చిన్న వయస్సులో వివాహం కావడంతో తరుచూ గర్భాధారణ తదితర కారణాలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్, గుట్కా, తంబాకు, పాన్‌మసాలా, దూమపానం, మద్యపానం తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి.
ములుగు, మల్లంపల్లి
వెంకటాపురం(ఎం)
గోవిందరావుపేట
ఎస్‌ఎస్‌తాడ్వాయి
ఏటూరునాగారం
మంగపేట
కన్నాయిగూడెం
వెంకటాపురం(కె)
వాజేడు
జిల్లాలో 238 మంది వ్యాధిగ్రస్తులు
రోజురోజుకూ పెరుగుతున్న రోగులు
ఎన్‌సీడీ సర్వేలో వివరాలు వెల్లడి
82
07
35
15
20
32
09
18
20
నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాం..
జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ నిర్థారణ పరీక్షలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని క్యాన్సర్ ఆస్పత్రులకు తరలిస్తున్నాం. ఎన్‌సీడీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ప్రజలు ఆహార అలవాట్లను మార్చుకోవడంతో పాటు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. – గోపాల్‌రావు, జిల్లా వైద్యాధికారి


