ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులు 64 వినతులు అందజేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 24 వినతులు రాగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 40 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రజావాణిలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, గిరిజన దర్బార్‌లో లెనిన్ వత్సల్ టొప్పో వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు అందించిన ప్రతీ దరఖాస్తును గడువులోగా అధికారులు పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సాద్యాసాద్యాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా పరిష్కారం చూపాలని ఆదేశించారు. వినతులు స్వీకరించిన కలెక్టర్ వాటిని పరిశీలించి ఆయా శాఖల అధికారులకు బదలాయించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టి తీసుకున్న చర్యలను నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావుతో పాటు ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా గిరిజన దర్బార్‌లో వినతులు స్వీకరించిన పీఓ లెనిన్ వత్సల్ టొప్పో వాటిని పరిశీలించారు. పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్దన్, ఎస్‌డీసీఓ ప్రతాప్, ఈఈ ప్రవీణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, జేడీఎం కొండల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 24, గిరిజనదర్బార్‌లో 40
అర్జీల రాక
స్వీకరించిన కలెక్టర్ హేమంత్
సహదేవరావు, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
పరిశీలించి పరిష్కరించాలని
అధికారులకు ఆదేశాలు
ఇందిరా జలప్రభ 8
గురుకుల సమస్యలు 8
ఇంజనీరింగ్‌శాఖ 6
ఆర్‌ఓఎఫ్‌ఆర్ 3
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2
ఎస్సీ కార్పొరేషన్ 1
భూ సమస్యలు 08
ఇందిరమ్మ ఇళ్లు 01
పింఛన్లు 02
ఉద్యోగ అవకాశాలు 09
ఇతర శాఖలు 04


