ములుగు రూరల్/వాజేడు: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థినులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు ఎంపికయ్యారు. ఈ మేరకు ములుగులోని బండారుపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థిని అమూల్య అండర్ 17 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ దేవకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న సిరిసిల్లలో నిర్వహించబోయే పోటీల్లో పాల్గొననున్నట్లు వివరించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ముగ్గురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కేశవరావు తెలిపారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని లాంగ్‌జంప్, టయాథ్లాన్లో తుర్స అక్షర, బడే హర్షిణి, హరిణి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. నవంబర్‌లో సంగారెడ్డిలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు.


