ములుగు రూరల్: పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నిరుపేద విద్యార్థులకు శిక్షణ తీసుకునే విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ సహకారంతో జిల్లా కేంద్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాలు సాదించాలన్నారు. శిక్షణ కాలంలో కష్టపడితే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకున్న వారు అవుతారన్నారు. శిక్షణ తరగతులు కేవలం ప్రిలిమ్స్ వరకు కాకుండా మెయిన్స్ వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, సీఐ సురేశ్, ఆర్‌ఐ స్వామి, కోచింగ్ సెంటర్ చైర్మన్ విశ్వనాథ్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


