హేమాచలక్షేత్రంలో విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో విశేష పూజలు

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీహేమాచలక్షేత్రం ఆదివారం భగవన్నామస్మరణతో మార్మోగింది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొనేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. భక్తులు ఒక్కసారిగా చేసిన భగవన్నామస్మరణతో హేమాచల క్షేత్రం ప్రతిధ్వనించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement