ములుగు రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగం సూచించారు. మండల పరిధిలోని బండారుపల్లి గురుకుల పాఠశాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ఈ నెల 11న అసిఫాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు. అనంతరం అథ్లెటిక్స్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపాల్ విజేందర్‌రెడ్డి, పీఈటీ రాజ్‌కుమార్, స్వరూప, నాగమణి, రజిత, శైలజ పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగం


