చిట్యాల : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భూపాలపల్లిలో అక్టోబర్ 9న పుష్ప గ్రాండ్లో నిర్వహించే మెగా జాబ్‌మేళాకు అర్హత కలిగిన నిరుద్యోగులు నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ జయశ్రీ కోరారు. శనివారం మండల కేంద్రంలోని స్ధానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిరుద్యోగులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అమె మా ట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శులు గ్రామంలోని నిరుద్యోగులను గుర్తించి ఒ క్కొక్కరిని జాబ్‌మేళాకు నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని కోరారు. జీపీ పరిధిలో వీఓల సహకారంతో ప్రతి ఇంటిని తిరిగి నిరుద్యోగుల వివరా లను సేకరించాలని కోరారు. అలాగే నమోదు చేసిన వారి వివరాలను ప్రతీ రోజు నివేదికను పంపించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ వసంతరావు, ఎస్సై పోచంపల్లి సతీష్, ఏపీఏం కోటేశ్వర్రావు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.


