మంగపేట: మండలంలోని తిమ్మంటకు చెందిన అంబేడ్కర్ సంఘం జిల్లా కోకన్వీనర్ మోదుగు బాబు భార్య శ్రీలత ఇటీవల మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు శనివారం పరామర్శించి రూ.5,000 నగదు, 25 కేజీల బియ్యం అందజేశారు. అదే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దుర్గం నర్సింహారావు, వెంకటేశ్వర్లు తండ్రి దుర్గం చినమల్లయ్య ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.3,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూజారి సురేందర్, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఎడ్ల నరేష్, హరికృష్ణ, తిరుపతి, బొర్రయ్య, సత్యనారాయణ, సతీష్, మురళి, భానుచందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.


