ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు నడిపించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు నడిపించాలి

Oct 4 2026 10:13 AM | Updated on Oct 4 2026 10:13 AM

ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు నడిపించాలి పోగొట్టుకున్న ఫోన్‌ అప్పగింత పరామర్శ గంజాయి సేవిస్తున్న కమిటీల ఎన్నిక

ఏటూరునాగారం: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించాలని రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీఏ) డైరెక్టర్‌ వసంత శ్రీనివాస్‌ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. చెల్పాక, ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలను పునరుద్ధరించాలన్నారు. జిల్లాలోని గిరిజన పల్లెలకు ఆర్టీసీ సేవలను విస్తృతం చేయడం వల్ల రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు మరింత మేలు జరుగుతుందని వివరించామన్నారు. ఆర్టీసీ సర్వీసుల విషయంపై అధికారులతో చర్చించి సర్వీసులు వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

వాజేడు: మండల పరిధిలోని మండపాక గ్రామానికి చెందిన కళ్లెం ప్రవీణ్‌ నెల రోజుల క్రితం పేరూరు గ్రామానికి వెళ్తుండగా ఫోన్‌ పోగొట్టుకున్నాడు. ఈ మేరకు వాజేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా కానిస్టేబుల్‌ రమణ ఫోన్‌ను రికవరీ చేయగా శనివారం ఎస్సై సతీశ్‌ బాధితుడికి అందజేశారు.

ఏటూరునాగారం: మండలంలోని రొయ్యూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా నాయకుడు సోదారి హరీశ్‌ భార్య స్వర్ణలత శనివారం మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని జిల్లా ఆత్మ చైర్మన్‌ రఘు పరామర్శించారు. మృతదేహం వద్ద నివాళులర్పించారు. నాయకులు రామయ్య, లాలయ్య, రమేష్‌, అర్జున్‌, తిరుపతి, రాజశేఖర్‌ ఉన్నారు.

ఐదుగురిపై కేసు

చిట్యాల : మండలంలోని జూకల్‌ గ్రామశివారులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్‌ తెలిపారు. శనివారం జూకల్‌ ప్రాంత శివారులో కెనాల్‌ స మీపంలోని ఖాళీ ప్రదేశంలో కొంతమంది వ్య క్తులు గంజాయి సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. రెండో ఎస్సై ఓంపాల్‌ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా వెంబడించి వారిని పట్టుకున్నారు. వీరిలో చల్లగరిగకు చెందిన మ్యాదరి ప్రశాంత్‌, దూడపాక ప్రకాశ్‌, బైస బన్నీ, కుంచం బన్నీ, ముచినిపర్తికి చెందిన పసరగొండ సంజయ్‌ రాజ్‌లకు వైద్యపరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌ రావడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి రూరల్‌ : రాష్ట్ర పార్టీ ఆదేశానుసా రం ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 12వ తేదీ వరకు జిల్లాలోని ఓబీసీ నా యకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ట్లు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ తెలిపారు. శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓబీసీ జిల్లా పరిశీలకులు నార్లవేని కుమారస్వామితతో కలిసి కరుణాకర్‌ హాజరై మాట్లాడారు. పోటీదారులు ఆధార్‌కార్డుతో పాటు, 3 పాస్‌ ఫొటోలు తీసుకు రావాలని సూచించారు. సమావేశంలో ము న్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మల్హర్‌: మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ (ఎమ్మార్పీస్‌ టీ) మండల, తాడిచర్ల గ్రామ నూతన కమిటీలను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీస్‌టీ వ్యవస్థాపకులు ప్రభాకర్‌ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు బూడిద సమ్మయ్య మాదిగ సమక్షంలో జరిగిన ఎన్నికలో మండల అధ్యక్షుడిగా గుగ్గిళ్ల రాజ్‌ కుమార్‌ మాదిగ నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడుగా ఇందారపు మొగిలి, ప్రధాన కార్యదర్శిగా బూడిద శ్రావణ్‌, ప్రచార కార్యదర్శిగా రోడ్డ సంజీవ్‌, కార్యదర్శులు ఇందారపు రంజిత్‌, కొలుగూరి సందీప్‌లను ఎ న్నుకున్నారు. తాడిచర్ల గ్రామ అధ్యక్షుడిగా కొ లు గూరి సంపత్‌, ఉపాధ్యక్షుడిగా తాండ్ర ఆశీర్వాదం, ప్రధాన కార్యదర్శిగా, తాండ్ర సదానందం, ప్రచార కార్యదర్శిగా ఇనుగాల సతీష్‌, కార్యదర్శిగా తాండ్ర కిరణ్‌ కుమార్‌ను ఎడ్నికున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement