కన్నాయిగూడెం: ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వరకు ప్రధానరోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను అటవీ శాఖ అధికారులు శనివారం తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా పొదలు పెరగడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అటవీ శాఖ ఏటూరునాగారం నార్త్ రేంజ్ అధికారి అశోక్ ఆధ్వర్యంలో పొదలు తెలగించే కార్యక్రమం చేపట్టారు. రోడ్డుకు మలుపుల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న పొదలు తొలగించి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులకు ఆటంకం కలగకుండా చేస్తున్నట్లు రేంజర్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
విలాసాగర్లో
వైద్యశిబిరం
మల్హర్(కాటారం): మండలంలోని విలాసాగర్, ఎంజేపీ బాయ్స్ హాస్టల్లో శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ ఎం.మౌనిక ఆదేశాల మేరకు నిర్వహించిన శిబిరంలో ప్రజలకు, విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై వైద్యులు అవగాహన కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు రా కుండా ఉంటాయని సూచించారు. ఇళ్ల చుట్టూ నీటి గుంటలు లేకుండా చూడాలని, పాత సామాన్లు, కొబ్బరిబొండాలు, బాటిళ్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం వస్తే వెంటనే ఆశా, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించా లని తెలి పారు. ఎంఎల్హెచ్పీ డాక్టర్ తిరుపతి రెడ్డి, డాక్టర్ సుమన్, సర్పంచ్ కందికొండ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ సరళ, రజిని, పాల్గొన్నారు.
బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
రేగొండ : బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వ హించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని భూపాలపల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్ఙ్ కీర్తిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రూపిరెడ్డిపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో సేవ సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆమె హాజరై మాట్లాడుతూ చిన్నారుల ఆ రోగ్యం, పోషణ, ప్రాథమిక వి ద్య విషయంలో అంగన్వాడీలు కీలకపాత్ర పోి షస్తాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొని యాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందిని శాలువతో సన్మానించారు.


