ములుగు రూరల్: సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించవచ్చని ఎస్సై ఎస్.వెంకటేశ్ అన్నారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్బాపురం గ్రామంలో నేరాల నియంత్రణ, గ్రామీణ భద్రతే లక్ష్యంగా సీసీ కెమెరాల అమర్చడంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు గ్రామానికి 24 గంటల పాటు రక్షణగా నిలుస్తాయన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు, నేరాలు అదుపులోకి రావడమే కాకుండా, అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంటుందన్నారు. గ్రామ భద్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ గ్రామంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా పంట పొలాల్లో ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వల్ల రైతులు, కూలీలు మృతి చెందడం జరుతుందన్నారు. అలా ఏర్పాటు చేయడం చట్ట రీత్యా నేరమన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయికృష్ణ, రచిత్ర, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
ఎస్సై ఎస్.వెంకటేశ్


