ఎస్‌ఎస్‌తాడ్వాయి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. శనివారం మేడారంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మేడారం భక్తులకు మరుగుదొడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు. మేడారం పేరు చెప్పుకుని ప్రచారం కాకుండా చేతల్లో అభివృద్ధి చూపాలని అన్నారు. 22–ఏ పేరుతో పేదలు, రైతులు సాగు చేసుకుంటున్న భూములపై అనిశ్చితి నెలకొనడం ఆందోళనకరమని, వారికి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాడుతుందని తెలిపారు. పట్టభద్రులను కలిసి వారి సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలపై చర్చించి బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. మేడారం జాతర మాజీ చైర్మన్లు కాక లింగయ్య, రేగ నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రమణయ్య, నాయకులు రమేశ్, జజా చంద్రం, ఇర్ప శివకుమార్, చిడం బాబురావు, గొంది శ్రీధర్, గడ్డం అరుణ, గుర్రం సమ్మీరెడ్డి, కోట సురేష్, ఇందారపు లాలయ్య, కుక్కల శ్రీను, ఎండీ రఫిక్, ఆలం అర్జున్, చిడం సాగర్, దండుగుల రాజేశ్, మదరి కేశవరావు, గజ్జెల నర్సయ్య, సిద్ధబోయిన వసంతరావు, భూక్మా శ్రీనివాస్ పాల్గొన్నారు.
పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాగజ్యోతి


