భూపాలపల్లి అర్బన్ : రోడ్డు విస్తరణ, మున్సిపల్ క మర్షియల్ భవనాల నిర్మాణం పేరుతో సింగరేణి కార్యాలయాల జోలికొస్తే ఊరుకునేది లేదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. శనివారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే గనులు, ఓసీ గనులు, వర్క్‌షాపులలో కార్మికులు న ల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం సింగరేణి సీఎండీకి, సంబంధించిన అధికారులకు జేఏసీ నాయకులు మెమోరాండం అందజేశారు. కా ర్మిక సంఘాలు తమ సొంత నిధులతో నిర్మించుకు న్న కార్యాలయాలను ముందస్తు నోటీసులు, సంప్రదింపులు లేకుండా తొలగించడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. లీజు ఒప్పందాలను గౌరవించి కార్యాలయాలను పరిరక్షించాలని డిమాండ్ చే శారు. కూల్చివేత అనివార్యమైతే నిబంధనల ప్ర కారం నష్టపరిహారం, ప్రత్యామ్నాయ కార్యాల య స్థలం కల్పించాలని కోరారు. ఏకపక్షంగా కూల్చివేత చర్యలకు పాల్పడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కా ర్యాలయాల పరిరక్షణ కోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడతాయని స్పష్టం చేశారు.


