‘ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలి’

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

వెంకటాపురం(కె): నాయీబ్రాహ్మణులు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్‌ అన్నారు. మండల కేంద్రంలో శనివారం కొయ్యల వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండల మహాసభను నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనమంతా ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన జిల్లా మహాసభకు నాయీబ్రాహ్మణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహాసభ ఆహ్వాన పత్రాలను నాయీ బ్రాహ్మణులకు అందజేశారు. ఈ మహాసభలో సత్యనారాయణ, కుమార్‌, వెంకటేశ్‌, మల్లిఖార్జున్‌, రాజశేఖర్‌, సత్యనారాయణ, శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement