ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలు ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన మాదారపు లక్ష్మి. ఈమె భర్త ఐదేళ్ల క్రితం మరణించాడు. అయితే తన భర్త మీద ఉన్న పింఛన్ తన పేరు మీదకు మార్పించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయం వెళ్లగా ఆమె ఆధార్‌కార్డు ఆన్‌లైన్‌లో నమోదు చేయగా మరణించినట్లు రికార్డులో ఉండడం గమనార్హం. అయితే ఆ కార్యాయంలో పనిచేసే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని పలువురు అధి కారులు చెప్పినప్పటికీ దానిని సరిచేయడం లేదు. దీంతో ఆమె కలెక్టర్‌కు ప్రజావాణిలో విన తి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకుంటుంది.
ఏటూరునాగారం: గిరివాణి, ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ, కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అర్జీదారుల సమస్యలు విని వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో గిరివాణిలో 96 దరఖాస్తులు రాగా ప్రజావాణిలో 26 దరఖాస్తులను బాధితులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌కు చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంకటాపురం(కె) మండలం ఎదిర గ్రామ సమీపంలోని యాకన్నగూడెంలో ప్రభుత్వం నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసింది కానీ ఎలాంటి భవనం నిర్మించలేదని తక్షణమే నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్, క్యాంపస్ పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను వెంటనే అందించాలని స్పష్టం చేశారు. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఏపీవో వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ దివాకర ఆదేశాలు
గిరివాణిలో 96,
ప్రజావాణిలో 26 అర్జీల రాక
బాధితుల సమస్యలు విని
వినతులు స్వీకరించిన కలెక్టర్


