ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

వెంకటాపురం(ఎం): ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో నిర్మిస్తున్న రామాలయానికి సోమవారం మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మించిన పెద్దమ్మగుడిని సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బొమ్మకంటి వంశావతిరమేశ్‌, మామిడిశెట్టి సుగుణస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, నాయకులు భగవాన్‌రెడ్డి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌,

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

Advertisement
 
Advertisement
Advertisement