ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధులకు సోమవారం హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత తెలిపారు. రాయినిగూడెం పీహెచ్‌సీ డాక్టర్ నందకిశోర్, డాక్టర్ దీపిక తమ సిబ్బందితో కలిసి డే కేర్ సెంటర్‌లోని వయోవృద్ధులకు హెల్త్ చెకప్ నిర్వహించినట్లు వెల్లడించారు. బీపీ, షుగర్ టెస్టులు చేసి థైరాయిడ్‌తో పాటు అన్ని రకాల టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్ తీసుకున్నట్లు వివరించారు. ఈ క్యాంపులో సుమారు 35 మంది వయోవృద్ధులు హెల్త్ చెకప్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రాణమ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ చుంచు రమేశ్, రాయినిగూడెం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


