వనదేవతలకు ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

వనదేవతలకు ప్రత్యేక పూజలు

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ కుటుంబ సమేతంగా అమ్మవార్లను మంగళవారం దర్శించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద ఎస్పీ మొక్కులు చెల్లించి గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ సంప్రదాయంగా దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజారులు ఎస్పీ దంపతులను అమ్మవారి కండువాతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ మధు, రికార్డు అసిస్టెంట్‌ వీరన్న, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement