ములుగు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలపరిధిలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం చేపట్టిందని అన్నారు. వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేయటంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణహాని తప్పదని హెచ్చరించారు. పోలీస్ శాఖ వాహన తనిఖీలు చేసేది కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని అన్నారు. ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


