హేమాచలుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి

Apr 19 2026 7:59 AM | Updated on Apr 19 2026 7:59 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి హరినాధ్‌ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, రాజీవ్‌ శర్మ, ఈశ్వర్‌చంద్‌ వారి పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి సూర్యచంద్రకళ, అడిషనల్‌ జడ్జి డి.మధులిక తేజ, ఎస్సై టీవీఆర్‌ సూరి పాల్గొన్నారు.

ఓవర్‌లోడ్‌ సమస్య తలెత్తకుండా చర్యలు

వెంకటాపురం(కె): మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి కాలంలో ఓవర్‌ లోడ్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్‌ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మొర్రవానిగూడెంలో సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్‌ పర్శిక శ్రీలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఈ ఉమారావు మాట్లాడుతూ గ్రామాల్లో మీటర్‌ లేనివారు పీఎం జుగా స్కీమ్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉచిత మీటర్‌ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్‌దాస్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ ఫరీద్‌, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి క్వాలిటీ కంట్రోల్‌ విభాగం నూతన కమిటీ

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి క్వాలిటీ కంట్రోల్‌ విభాగం నూతన కమిటీని ఏఐటీయూసీ జనరల్‌ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఫిట్‌ సెక్రటరీగా ధారపోషం, అసిస్టెంట్‌ ఫిట్‌ సెక్రటరీగా కార్తీక్‌తోపాటు షిఫ్ట్‌ ఇన్‌చార్జ్‌లుగా ఇ.శ్రీనివాస్‌, మధు, జి.శ్రీనివాస్‌, ఎం.రవికృష్ణ, కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం స్థానిక కొమురయ్య భవన్‌లో క్వాలిటీ విభాగంలో పనిచేస్తున్న శాంపిల్‌ మజ్దూర్‌ కార్మికులను ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేష్‌, నాయకులు సుధాకర్‌రెడ్డి, జి. శ్రీనివాస్‌, ఎండీ ఆసిఫ్‌ పాషా, రామచందర్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ ఇన్‌చార్జ్‌ నూకల చంద్రమౌళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన

మల్హర్‌(కాటారం): మండలంలోని కాటారం సన్తూర్‌పల్లిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సంకీర్త్‌ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలిపాడ్‌, పార్కింగ్‌ ప్రాంతాలు, సభావేదికను సమగ్రంగా తనిఖీ చేశారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్‌ స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్కింగ్‌ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు. హెలిపాడ్‌ ప్రదేశంలో దుమ్ము ఎగరకుండా నీరు చల్లడంతో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్‌, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement