వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్ అధికారులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. రామప్ప గార్డెన్ ఆవరణలో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయికృష్ణ, సీఏ అజిత్, తహసీల్దార్ గిరిబాబు, ఆర్‌ఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


