ములుగు రూరల్: అర్హులందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని రాయనిగూడెం గ్రామ పంచాయతీలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి, తదితర పథకాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


