వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామప్ప దేవాలయంలో కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గిరిబాబు హాజరై ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయి కృష్ణ, సీనియర్ సీఏ అజిత్‌లు మాట్లాడారు. దేశంలో మూడు వేలకు పైగా కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్నామన్నారు. ఇందులో 43 యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు, వాటి చరిత్ర తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను రామప్పలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కట్టడాలను సంరక్షించడంలో బాధ్య త వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రమేశ్, సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ రాజు, కేంద్ర పురావస్తు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


