సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

డీఎస్పీ కిశోర్‌కుమార్‌

ములుగు రూరల్‌: సీపీఆర్‌పై ప్రతీఒక్కరికి అవగాహన ఉండాలని డీఎస్పీ కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిని వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించడం సామాజిక బాధ్యతన్నారు. క్షతగాత్రులను కాపాడితే రహ్‌వీర్‌ పథకం ద్వారా రూ.25వేల పారితోషికం అందిస్తామన్నారు. ప్రమాదాల సమయంలో ఊపిరి అందక ఇబ్బందులు పడే వారికి వెంటనే సీపీఆర్‌ చేసి కాపాడాలని సూచించారు. ప్రమాదం జరిగిన గంట సమయాన్ని గోల్డెన్‌ అవర్‌గా పరిగణిస్తారని, ఆ సమయంలో చికిత్స అందించినట్లయితే ప్రాణాలు రక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఐ సురేష్‌కుమార్‌, ఎస్సై ఉపేందర్‌రావు, చంద్రశేకర్‌, 108 జిల్లా మేనేజర్‌ రాజ్‌కుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌ అన్వేష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement