ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ములుగు: తెలంగాణ ఎంప్లాయీస్‌ టీచర్స్‌, పెన్షనర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ, తహసీల్దార్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఎస్‌, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. జూన్‌ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వాంకుడోతి జ్యోతి, గోనె రవీందర్‌, సల్లకొండ పద్మాకర్‌ రెడ్డి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement