వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

ములుగు: ములుగు మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినందున వ్యాపారులు (2026–27)కు సంబంధించిన ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొంతమంది వ్యాపారులకు ట్రేడ్‌ లైసెన్స్‌లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా దుకాణాలు, హోటళ్లు, మెడికల్‌ షాపులు, వ్యాపార సంస్థలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇప్పటి వరకు లైసెన్స్‌ లేని వ్యాపారులు కొత్త ట్రేడ్‌ లైసెన్స్‌ కొరకు దరఖాస్తు చేసుకోవాలని, లైసెన్స్‌ ఉన్న వారు పాత లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలన్నారు. నిర్ధేశిత గడువులోగా టీఎల్‌ పొందని వారిపై మున్సిపల్‌ యాక్ట్‌ 2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ములుగు పట్టణ వాణిజ్య దారులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement