విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ములుగు రూరల్‌: ఆస్పత్రుల్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ కుమారస్వామి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిల్లో విద్యుత్‌ వైర్లు నాణ్యమైనవి వినియోగించాలని, ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిరంతరం పరిశీలించాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా, సమయోచితంగా స్పందించడం ముఖ్యమన్నారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్లమార్గంలో రావాలన్నారు. అనంతరం ప్రమాదాలు జరిగిన సమయంలో తక్షణ చర్యలపై ప్రాక్టికల్‌ డెమో నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement