డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు పరిశీలన

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు పరిశీలన

వాజేడు: కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి జిల్లా వైద్యాధికారి గోపాల రావు వాజేడు, పేరూరు, ఎదిర వైద్యశాలలను శుక్రవారం పరిశీలించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న రోజులు డయాలసిస్‌ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా అందుబాటులో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో భాగంగా రోగులకు ఏ వైద్యశాల అనుకూలంగా ఉంటుందో అనే కోనంలో వాజేడు, పేరూరు, ఎదిర వైద్యశాలలను పరిశీలించారు. ఆస్పత్రుల్లో అదనపు గదులు, కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ చేయడానికి వీలుగా ఉంటుందా లేదో చూశారు. త్వరలోనే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త జగదీష్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement