జిల్లా ఆస్పత్రిలో మంచినీటి ఇబ్బందులు
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఓపీ సేవలు పొంది మందులు రాయించుకొని వెళ్లే వారు కొందరైతే.. వైద్యం అవసరమై ఆస్పత్రిలో అడ్మిట్ అయి వైద్యం పొందే వారు కొందరు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. రోగులు, వారితో వచ్చే అటెండెంట్లు మాత్రం తాగునీటి కోసం తండ్లాట పడుతున్నారు. ఆస్పత్రిలో రోగులు పడుతున్న తాగునీటి తండ్లాటపై ‘సాక్షి’ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
తాగునీరు తాగేదెలా?
జిల్లాకేంద్రంలోని ఆస్పత్రి ఆవరణలో తాగునీటికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ నీరు తాగేందుకు గ్లాస్ మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ఓ పెద్దాయన మంచినీళ్ల నల్లా వద్ద చేతులతో నీరు తాగి దాహం తీర్చుకున్నారు.
ఓపీ 504, ఇన్‌పేషెంట్లు 33
ఆస్పత్రిలో రోజువారీగా అత్యధిక సంఖ్యలో అవుట్ పేషెంట్లు వైద్యసేవలు పొందుతున్నారు. రోజు వారీగా సుమారు ఓపీ 422, ఈఓపీ 82, అడ్మిట్ పేషెంట్లు 33 మందికి వైద్యం అందిస్తున్నారు.
ప్లాంట్ ఎక్కడ ఉందో తెలియని వైనం
ప్లాంట్ ఉన్నా.. గ్లాస్ కరువు
ఇబ్బందులు పడుతున్న అటెండెంట్లు


